ఘనంగా పోత లింగన్న విగ్రహ ప్రతిష్టాపన

ఘనంగా పోత లింగన్న విగ్రహ ప్రతిష్టాపన

NRML: నిర్మల్ మండలం న్యూ పోచంపాడు గ్రామంలో ఆదివారం నడుకుడ పోచమ్మ, అడెల్లి పోచమ్మ ఆలయాల వద్ద నూతనంగా పోత లింగన్న విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించారు. గ్రామస్తుల పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకోగా, భారీగా వచ్చిన భక్తులు ఊరేగింపుగా ఆలయాలకు చేరుకొని విగ్రహాలను ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు లింక పోశెట్టి, ఆర్మూర్ నరేష్, గంగాధర్, గోపిలు పాల్గొన్నారు.