శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యకళ్యాణం

శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యకళ్యాణం

BDK: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం నాడు నిత్యకళ్యాణం ఘనంగా జరిగింది. వేదమంత్రాల నినాదాలతో ఆలయం నిండిపోయి భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదం అందజేశారు. స్వామి, అమ్మవారిని దర్శించుకోవడానికి దూరదూరాల నుంచి జనం తరలిరావడంతో ఆలయం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.