సావిత్రి బాయి పూలె 194 వ జయంతి వేడుకలు
VKB: కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామంలో సావిత్రి బాయి ఫూలే 194వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి బాయి ఫూలే సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేశముఖ్ చంద్ర, భూపాల్ రావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, వార్డు సభ్యులు, గ్రామ సెక్రెటరీతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.