ఇరాన్‌కు 80 శాతం గ్యాస్ అక్కడి నుంచే!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపకపోతే సౌత్ పార్స్‌పై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసింది. ఒకవేళ ట్రంప్ దీనిని ధ్వంసం చేస్తే ఇరాన్‌లో గ్యాస్ సంక్షోభం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ ఉపయోగించే 80 శాతం సౌత్ పార్స్ నుంచే వెళ్తుందని తెలిపారు. అందుకే దీనిని ఇరాన్ ఇంధన జీవనాడి అని పిలుస్తారని పేర్కొన్నారు.