ఈ నెల 6న విద్యార్థులకు క్విజ్ పోటీలు

ఈ నెల 6న విద్యార్థులకు క్విజ్ పోటీలు

KDP: ఖాజీపేట మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో దివిజా సంపతి తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 6న ఉదయం 8:45 గంటలకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరచిన వారికి ఆగస్టు 15న విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్నట్లు చెప్పారు.