ఒకే గదిలో విగతజీవులుగా నలుగురు స్నేహితులు
UP కాన్పూర్‌లో దారుణం జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఆయిల్ సీడ్స్ కంపెనీలో పని చేస్తున్న నలుగురు స్నేహితులు ఒకే గదిలో విగతజీవులుగా కనిపించారు. గత రాత్రి చలి ఎక్కువ కారణంగా బొగ్గుకు నిప్పుపెట్టి చలి కాచుకున్నారు. ఆ తర్వాత గది లాక్ చేసుకుని నిద్రపోవడంతో బొగ్గు నుంచి వెలువడే వాయువుల వల్ల ఆక్సిజన్ తక్కువై చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.