వంతెన నిర్మించాలంటూ గ్రామస్థుల నిరసన

వంతెన నిర్మించాలంటూ గ్రామస్థుల నిరసన

అన్నమయ్య: మదనపల్లె మండలం నల్లగుట్టపల్లె వద్ద గల హంద్రీ-నీవా కాలువపై వంతెన నిర్మించాలంటూ గ్రామస్థులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. వంతెన లేకపోవడంతో పొలాలకు వెళ్ళేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. కాలువకు నీళ్లు వదిలితే పశువులు, రైతుల రాకపోకలు ఆగిపోతాయన్నారు. ఈ విషయమై స్థానిక సబ్ కలెక్టర్‌కు ఇదివరకే వినతి పత్రం అందజేశామన్నారు.