VIDEO: భద్రాద్రి జిల్లాలో రగులుతున్న పోడు వివాదం
BDK: బూర్గంపాడు మండల కృష్ణసాగర్ బట్టుగూడెం గ్రామంలో ఆదివాసి గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు విరుచుకుపడ్డారని స్థానికులు నేడు వెల్లడించారు. ఆదివాసి గిరిజనులు పోడు చేసుకుంటున్న భూమిలో ట్రెంచ్ కొడుతున్న ఫారెస్ట్ అధికారులతో మాట్లాడదామని వెళ్లిన గిరిజనులపై నిర్దాక్షిణ్యంగా చేయి చేసుకున్నట్టు తెలిపిన బట్టుగూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.