ఒక్క విమానాశ్రయం కూడా లేని దేశాలివే..!
ప్రపంచంలో విమానాశ్రయాలు లేని దేశాలు కూడా ఉన్నాయి. వాటికన్ సిటీ, శాన్ మారినో, మొనాకో, అండోరా, లీచ్టెన్‌స్టెయిన్ దేశాల్లో ఒక్క ఎయిర్‌పోర్టు కూడా లేదు. అక్కడి ప్రజలు సమీపంలోని ఇతర దేశాల విమానాశ్రయాలను ఉపయోగిస్తారు. అంతేకాదు వీటిలోని కొన్ని దేశాల్లో జనాభా వేలల్లోనే ఉంటుంది. ఈ దేశాలతో పాటు టోకెలావ్, పిట్‌కైర్న్ దీవులు వంటి ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాలు లేవట.