జూరాలకు 1,19,462 క్యూసెక్‌ల వరద విడుదల

GDWL: కర్ణాటకలో భారీ వర్షాల ప్రభావంతో జూరాల ప్రాజెక్టుకు శనివారం 1,19,462 క్యూసెక్‌ల వరద వచ్చింది. అధికారులు 18 గేట్లు ఎత్తి 81,713 క్యూసెక్, పవర్‌హౌస్‌కు 39,485 క్యూసెక్, ఎడమ కాలువకు 550 క్యూసెక్, కుడి కాలువకు 490 క్యూసెక్ మొత్తం 1,22,390 క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద నీరు శ్రీశైలంకు చేరుతోంది.