పంగులూరు స్మశాన వాటికలో సమస్య పరిష్కారం
బాపట్ల: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని కొండమూరు గ్రామంలో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 11న జరిగిన పర్యటనలో ఇచ్చిన సూచనల ప్రకారం శుక్రవారం జే.పంగులూరు మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో సర్వే నెం.297లో ఉన్న శ్మశాన వాటికను పరిశీలించారు. మొత్తం 23 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న భూమికి అధికారులు హద్దులు ఖరారు చేశారు.