VIDEO: అంతరాష్ట్ర చెకోపోస్ట్ వద్ద ఇసుక తనిఖీ కేంద్రం ప్రారంభం
NZB: సాలూర చెక్ పోస్ట్ వద్ద అంతరాష్ట్ర ఇసుక తనిఖీ కేంద్రాన్ని శనివారం టీజీఎండీసీ డైరెక్టర్ భవేశ్ మిశ్రా, కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా మహారాష్ట్ర నుంచి రవాణా చేసుకునేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ముందుగా ఆన్‌లైన్‌లో టన్నుకు రూ.200 చెల్లించి మహారాష్ట్ర నుంచి తరలించుకోవచ్చని పేర్కొన్నారు.