14న విశాఖ తీరంలో నేవీ మారథాన్
VSP: విశాఖలో ఈనెల 14న ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో 10వ ఎడిషన్ నేవీ మారథాన్ జరగనుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం సాయంత్రం తెలిపారు. ఆర్కేబీచ్ నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల్లో 17 దేశాల నుంచి 17,500 మంది పాల్గొంటున్నారు. 42, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో ఈ పరుగు కొనసాగుతుంది. ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.