హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం
TG: హైకోర్టు ఆదేశాలను హైడ్రా పాటించడం లేదని న్యాయస్థానం ఆగ్రహించింది. ఇష్టానుసారం వ్యవహరిస్తే కోర్టు అధికారం చూపిస్తుందని హెచ్చరించింది. తుమ్మిడికుంట పునరుద్ధరణలో ఇతర భూముల్లో యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఆదేశాలు ధిక్కరించినందుకు ధిక్కరణ పిటిషన్ దాఖలు కాగా, కమిషనర్ విచారణకు హాజరయ్యారు. హైడ్రాకు వ్యతిరేకంగా రోజూ 10 పిటిషన్లు వస్తున్నాయని కోర్టు పేర్కొంది.