సమ్మె విరమించుకోవాలి: మంత్రి సీతక్క
TG: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. 'ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో చర్చించి సమస్యను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమ్మె వల్ల ఎంతోమంది పేదింటి బిడ్డలు, పేదవాళ్లు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. 32 డిమాండ్లలో దాదాపు 29 అంశాలకు ప్రభుత్వం అనుకూలంగా ఉంది. ప్రభుత్వానికి సహకరించాలని ఆర్టీసీ కార్మికులను కోరుతున్నాను' అని పేర్కొన్నారు.