అక్కన్నపేట కొత్తచెరువులో మృతదేహం

అక్కన్నపేట కొత్తచెరువులో మృతదేహం

MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులోని కొత్తచెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. సోమవారం ఉదయం చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.