రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకు వినతి

సూర్యాపేట: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే సామేలు నివాసంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. ఆదివారం ఆరు మండలాల రేషన్ డీలర్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేలు మాట్లాడుతూ.. సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్లి రేషన్ డీలర్లు సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.