వృద్ధురాలి అత్యాచారం కేసు.. నేరస్థుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

JGL: రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలిని అత్యాచారం చేసిన కేసులో నిందితుడు పుట్ట గంగరాజం (60)కు 10 ఏళ్ల జైలు శిక్షను జడ్జి నారాయణ విధించారు. పోలీస్ అధికారులు ఆధారాలు సమర్పించగా, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టి విచారించారు. ఈ సందర్భంగా సమాజంలో నేరం చేసిన వారెవరూ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరని SP అన్నారు.