పనిచేయని వెబ్‌సైట్.. రోగులకు తప్పని కష్టాలు

HYD: ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రికి వచ్చే రోగులకు, అవుట్ పేషెంట్ స్లిప్ ఇచ్చే వద్ద వెబ్ సైట్ సరిగ్గా పనిచేయకపోవడంతో కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సిస్టం చాలా స్లోగా ఉంటుందని, ఒక్కొక్కరికి అత్యధిక సమయం తీసుకుంటుందని తెలిపారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.