కలెక్టర్ రాజాబాబు పర్యటన వివరాలు
ప్రకాశం: జిల్లా కలెక్టర్ రాజాబాబు ఇవాళ కనిగిరి మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని బడుగులేరు గ్రామంలో కలెక్టర్ ఉదయం 12 గంటలకు పర్యటిస్తారని అధికారులు తెలిపారు. బడుగులేరులో ఇటీవల కలుషితమైన నీరు తాగి అందరు విద్యార్థులకు కామెర్ల వ్యాధి సోకిన విషయం తెలిసిందే. అక్కడి తాజా పరిస్థితులను ఎమ్మెల్యే నరసింహారెడ్డితో కలిసి కలెక్టర్ పర్యవేక్షిస్తారని సమాచారం.