జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే

ప్రకాశం: జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం ఒంగోలులోని కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని పలు పెండింగ్ సమస్యలను కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు. వాటిని త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి పత్రాన్ని అందజేశారు.