8 నుంచి గంగమ్మ తల్లి కొలుపు మహోత్సవం

8 నుంచి గంగమ్మ తల్లి కొలుపు మహోత్సవం

NLR: పొదలకూరు శివాలయం వీధిలోని గంగమ్మతల్లి కొలుపు మహోత్సవం ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు వైభవంగా జరగనుంది. ఆలయ కమిటీ, యాదవ సోదరుల ఆధ్వర్యంలో కుంకుమపూజ, అభిషేకం, సహస్రనామార్చన, పోతురాజు ముగ్గు, గ్రామోత్సవం, బోనాల ఊరేగింపులతో అమ్మవారి సేవలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.