అయినవిల్లి విఘ్నేశ్వరునికి మేలుకొలుపు సేవ
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం వేకువజామున స్వామి వారికి మేలుకొలుపు సేవ ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం బహుళ పాడ్యమి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వేచి ఉన్నారు.