రేపు మిర్యాలగూడలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
NLG: రేపు మిర్యాలగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరాయి.