CRPF రైజింగ్ డే సందర్భంగా రక్తదాన శిబిరం
విశాఖ మధురవాడలోని 234 బెటాలియన్ CRPF కార్యాలయంలో ఇవాళ 87వ సీఆర్‌పీఎఫ్ రైజింగ్ డే సందర్భంగా ఆరోగ్య శిబిరం, స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమాన్ని కమాండెంట్ మనోజ్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. జవాన్లు ఉత్సాహంగా రక్తదానం చేశారు. వైద్యులు, సిబ్బంది సహకారంతో ఈ శిబిరం విజయవంతమైంది.