యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం

పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యే విజయరమణరావు, కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీ పాల్గొన్నారు. విశ్వకర్మ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు నిర్వహించారు.