డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
NDL: కొలిమిగుండ్ల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో సీఐ మద్దినేని రమేశ్ బాబు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వాహన చోదకులను ఆపి, బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం సేవించారా లేదా అన్న తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపడతామని సీఐ హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.