'కోకో పంటను అంతర పంటగా సాగు చేయాలి'

'కోకో పంటను అంతర పంటగా సాగు చేయాలి'

కోనసీమ: కొబ్బరి తోటలలో అంతర పంటగా కోకో పంటను సాగు చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. అయినవిల్లి మండలం పోతుకుర్రు గ్రామంలో ఆయన బుధవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా పోతుకుర్రు, కె.జగన్నాధపురం గ్రామాల్లో పండిస్తున్న పంటల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోకో పంటను సాగు చేయడం ద్వారా అధిక లాభాలను రైతులకు పొందవచ్చని సూచించారు.