227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం: కలెక్టర్

227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం:  కలెక్టర్

KMM: ఖమ్మం నగరంలో మున్నేరు నది ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో 90 కుటుంబాల పరిధిలో 227 సభ్యులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వారికి అవసరమైన ఆహారం, పారిశుధ్యం, వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అతి తక్కువ ఆస్తి నష్టం, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.