'రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి'
ASR: మాడగడ పంచాయతీ దానిరంగిని జంక్షన్ నుంచి బస్కి పంచాయితీ భరెంగి బంధ గ్రామం వరకు తారు రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు నిన్న ఆయా గ్రామస్థులతో ఆ సంఘం నాయకులు రామారావు రోడ్డును పరిశీలించి మరమ్మతులు చేయాలని నిరసన తెలిపారు. రహదారి అధ్వానంగా ఉండటంతో అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.