విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన లారీ

WGL: ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయిన లారీ దూసుకెళ్లి రహదారి పక్కనున్న రెండు విద్యుత్ స్తంభాలను, రేకులషెడ్డు ధ్వంసం చేసింది. విద్యుత్ తీగలు తెగి రోడ్డు పక్కనే పడిపోయాయి. అధికారులు అప్రమత్తమై విద్యుత్ నిలిపియడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఖిల్లావరంగల్ మండలం తిమ్మాపూర్ క్రాస్ రోడ్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.