ఆరాధన ఉత్సవాలకు ప్రత్యేక పార్కింగ్

ఆరాధన ఉత్సవాలకు ప్రత్యేక పార్కింగ్

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు ఎస్సై శివాంజల్ తెలిపారు. మాధవరం నుండి వచ్చే వాహనాలకు హెలిప్యాడ్ గ్రౌండ్, ఎమ్మిగనూరు నుంచి వచ్చే వాహనాలకు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నాగలదిన్నె రోడ్డు నుంచి వచ్చే వాహనాలకు అటువైపు కూడా ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.