VIDEO: జొన్నాడలో పోలీసుల కార్డెన్ సెర్చ్
కోనసీమ: ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వలన కలిగే దుష్ఫలితాలను పోలీసులు ప్రజలకు వివరించారు. అదే విధంగా మాదకద్రవ్యాల జోలికి పోమని ప్రతిజ్ఞ చేయించారు. కార్డెన్ సెర్చ్ నిర్వహించి 22 పత్రాలు లేని వాహనాలను గుర్తించినట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు.