మంత్రి ఆదేశాలతో నూతన బోర్‌వెల్

సత్యసాయి: రొద్దం మండలం రెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం టీడీపీ నాయకులు నూతన బోర్ వెల్స్ వేయించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని మంత్రి సవితకు తెలిపారు. మంత్రి స్పందించి రెడ్డిపల్లిలో నూతన బోరు వేయించారు. బోరులో నీళ్లు పుష్కలంగా పడ్డాయి. దీంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోరు వేయించినందుకు గ్రామస్థులు మంత్రికి కృతఙ్ఞతలు తెలిపారు.