'అల్లూరి జిల్లా దేశానికే ఆదర్శం'

'అల్లూరి జిల్లా దేశానికే ఆదర్శం'

ASR: నీతి ఆయోగ్ ప్రారంభించిన ఆకాంక్ష జిల్లాల కార్యక్రమానికి అల్లూరి జిల్లా ఎంపికైంది. దీంతో ఈ జిల్లా అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎన్నోఏళ్లుగా స్వచ్ఛంద సంస్థలు వేర్వేరుగా పని చేస్తూ.. పరిమిత ఫలితాలు మాత్రమే సాధించాయి. దీనిని అధిగమించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డిస్టిక్ట్ నాన్ ప్రాఫిట్ ఫోరం కీలక మార్పులు తెచ్చిందని నీతి ఆయోగ్ ఓ నివేదికలో పేర్కొంది.