నేడు ప్రజావాణి కార్యక్రమం

RR: రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అదనపు ఉపకమిషనర్ సురేందర్ రెడ్డి తెలిపారు. ఉ.10.30 నుంచి మ.ఒంటి గంట వరకు సర్కిల్ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. పలు డివిజన్లకు చెందిన ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.