తారు రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

పార్వతీపురం మండలం బాలగుడబ నుంచి వెంకటరాయుడిపేట వరకు నూతనంగా నిర్మించిన తారు రోడ్డును ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మంగళవారం ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో NRGS ఉపాధి హామీ పధకం నిధులు 200 లక్షల వ్యయంతో ఇటీవల ఈ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డును ఎమ్మెల్యే విజయచంద్ర ప్రారంభించారు. ప్రభుత్వం రోడ్లపై ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేస్తుందన్నారు.