'యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

'యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

NRPT: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏఎస్సై ఉస్మాన్ అన్నారు. ఆదివారం మద్దూర్ జూనియర్ కళాశాల మైదానంలో యువతకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఖైని, గుట్కా, జర్దా, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటిని తీసుకోవడం ద్వారా భయంకరమైన కేన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.