'నగరంలో నీటి వృధాను అరికట్టాలి'

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో సరైన నిర్వహణలో లేని వీధి తాగునీటి కుళాయిలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని, నీటి వృధాను అరికట్టాలని ఇంజనీరింగ్ విభాగం ఎస్. ఈ రామ్ మోహన్ రావు అధికారులకు సూచించారు. గురువారం ఆయన గిడ్డంగి వీధి, కంసాలి వీధి, కుక్కల గుంట, మున్సిపల్ వెహికల్ షెడ్డు పరిసర ప్రాంతాలలో పర్యటించి తాగునీటి సరఫరా నిర్వహణ పనులను పర్యవేక్షించారు.