జిల్లాలో సైబర్ కేటుగాళ్ల కొత్త మోసం

జిల్లాలో సైబర్ కేటుగాళ్ల కొత్త మోసం

కృష్ణా: జిల్లాలో సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు బకాయి కట్టాలంటూ బురిడీ కొడుతున్నారు. నగరవాసికి ఇలానే ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. మీరు ఇంకా విద్యుత్ బిల్లు చెల్లించలేదు. సరఫరా నిలిపివేస్తాం అని బెదిరించారు. ఇలా అతడి నుంచి విడతల వారీగా రూ. 2.50 లక్షలు కాజేశారు. ఇలాంటి మెసేజ్‌లను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.