మునిపల్లి రిసార్ట్‌లో జంట సూసైడ్

మునిపల్లి రిసార్ట్‌లో జంట సూసైడ్

MDK: పండగపూట సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మునిపల్లి మండలం భూసరెడ్డిపల్లి గ్రామ శివారులోని రిసార్ట్‌లో జంట సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారం.. ఓ జంట గురువారం సాయంత్రం రిసార్ట్‌ రూం అద్దెకు తీసుకున్నారు. ఉదయం రిసార్ట్ యజమాని పరిశీలించగా ఇద్దరు ఉరివేసుకొని కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.