సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ అరుదైన రికార్డ్

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ అరుదైన రికార్డ్

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ అరుదైన రికార్డు సాధించాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో 93 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియాపై టెస్టు మ్యాచ్‌లో 5 వికెట్లు, 50కి పైగా పరుగులు చేసిన తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా యాన్సెన్ చరిత్రకెక్కాడు.