ఉద్యోగం రాదేమోనని యువకుడు ఆత్మహత్య

ఉద్యోగం రాదేమోనని యువకుడు ఆత్మహత్య

NDL: కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయుని పేట గ్రామంలో జయకృష్ణ అనే యువకుడు సోమవారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జయకృష్ణ గత ఆరు నెలలుగా ఎటువంటి ఉద్యోగం రాకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఇక ఉద్యోగం రాదేమోనని తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.