భీమవరం మార్కెట్ యార్డు ఎదుట రైతులు ధర్నా

భీమవరం మార్కెట్ యార్డు ఎదుట రైతులు ధర్నా

W.G: రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ, రైతు సంఘం సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం భీమవరంలో ధర్నా నిర్వహించారు. ఏఎంసీ యార్డు వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి  సంబంధిత అధికారికి వినతి పత్రం అందజేశారు. ఖరీఫ్ ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.