'కాఫీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

'కాఫీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

ASR: కాఫీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం పాడేరులో కార్మికులతో కలిసి ఏపీఎఫ్ డీసీ డివిజనల్ మేనేజర్ జీ.కృష్ణబాబుకు వినతిపత్రం అందజేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు రోజువారీ వేతనాలు పెంచాలని కోరారు. హెల్పర్లను ప్లాంటేషన్ కండక్టర్లుగా నియామకాలు చేపట్టాలన్నారు.