VIDEO: యూరియా కోసం రైతుల ఎదురు చూపులు

SRCL: గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘం గోదాం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. శుక్రవారం ఉదయం గోదాం తెరవకముందే భారీ సంఖ్యలో రైతులు వచ్చి క్యూలైన్‌లో నిలబడ్డారు. సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటకు సరైన సమయంలో యూరియా అందించకపోతే పంట నష్టం వాటిల్లుతుందన్నారు.