పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై సమీక్ష
అన్నమయ్య: కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై రాయచోటి కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మార్పులు, చేర్పులపై అధికారులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచనలు ఇచ్చారు. ప్రతి కేంద్రంలో 1200 మంది ఓటర్లు ఉండేలా, అన్ని మౌలిక సదుపాయాలతో హేతుబద్ధీకరణ చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.