నేడు జిల్లాలో సీఎం పర్యటన వివరాలు

ASR: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఇవాళ అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించనున్నారు. ఉదయం గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో లగిశపల్లికి చేరుకుని, అక్కడి నుండి వంజంగి గ్రామానికి వెళ్ళి గిరిజన సంప్రదాయాలపై అక్కడి ప్రజలతో ముచ్చటిస్తారు. తరువాత ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని ప్రసంగిస్తారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి కూటమితో భేటీ అవుతారు.