6 నుంచి ఏపీటీఎఫ్ రాష్ట్ర మహాసభలు

VSP: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సమాఖ్య (ఏపీటీఎఫ్) ఆవిర్భవించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో విజయనగరంలో నిర్వహించనున్న వేడుకలను విజయవంతం చేయాలని సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జి. హృదయరాజు కోరారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ బిర్లా జంక్షన్ వద్ద ఒక భవనంలో శుక్రవారం మహాసభల గోడప్రతులు ఆవిష్కరించారు.