శతాధిక వృద్ధురాలు మృతి
MDK: మనోహరాబాద్ మండలం గౌతోజి గూడెం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు చుక్క పోచమ్మ (110) సోమవారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పోచమ్మ ఎలాంటి ఆహారం తీసుకోలేదని వివరించారు. భర్త 25 ఏళ్ల క్రితమే మృతిచెందగా, సంతానం కలగకపోవడంతో సోదరుల పిల్లలు ఆమె బాగోగులు చూసినట్లు వివరించారు.